Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
- సిఐటియు డిమాండ్
నవతెలంగాణ - భద్రాచలం
భవన నిర్మాణ కార్మికులందరికీ మోటార్ సైకిల్ పంపిణీ చేస్తామని 2022 శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీని వెంటనే అమలు చేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి డిమాండ్ చేశారు. మోటార్ సైకిల్ పంపిణీ చేయాలని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్‌ఐ బుద్ధ నరసింహారావుకి వినతి పత్రం అందించారు. అంతకుముందు సిఐటియు కార్యాలయంలో జరిగిన సభను ఉద్దేశించి బ్రహ్మచారి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో ప్రకటించిన హామీని ఏడాది గడిచిన అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.సంక్షేమ బోర్డులోని నిధులన్నీ కార్మికుల కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 55,000 దరఖాస్తులు సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్నాయని ఆ దరఖాస్తులన్నింటికీ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రమాదం వల్ల చనిపోయిన కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న ఆరు లక్షల పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచాలని సహజ మరణానికి ఇస్తున్న లక్ష రూపాయల పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని మండల పట్టణ కేంద్రాలలో భవన నిర్మాణ కార్మికులకు అడ్డా స్థలాలు కేటాయించాలని నిర్మాణ కార్మికుల అడ్డాలలో షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు మౌలిక వసతులను కల్పించాలని సీఐటియు డిమాండ్ చేసింది. 1996 కేంద్ర నిర్మాణ కార్మికుల చట్టం ప్రకారం భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్,ఉన్నత విద్యా రుణాలు అందజేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. 1979 వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్లో భావన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా సంక్షేమ బోర్డుకు కార్మిక సంఘాల నాయకులతోటి అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన నిర్మాణ రంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా మోటారు సైకిళ్ళు పంపినేని మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు అప్పారి రాము, నాయకులు ఎస్కే జాకీర్, చాట్ల శ్రీను అనుగోజు, శ్రీను, శివకూమార్, చిన్నరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ పంపిణీ చేయాలి
సిఐటియు
నవతెలంగాణ -చర్ల
భవన నిర్మాణ కార్మికులందరికీ మోటార్ సైకిల్ పంపిణీ చేస్తామని 2022 శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీని వెంటనే అమలు చేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని సిఐటియు మండల నాయకులు శ్యామలవెంకటేశ్వర్లు, కేవీపీఎస్ మండల కార్యదర్శి మచ్చా రామావు డిమాండ్ చేశారు. మోటార్ సైకిల్ పంపిణీ చేయాలని భావన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూచర్ల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు సిఐటియు కార్యాలయంలో జరిగిన సభను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో ప్రకటించిన హామీని ఏడాది గడిచిన అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డులోని నిధులన్నీ కార్మికుల కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి సుకరి వెంకటేశ్వర్లు తదితరులుపాల్గొన్నారు.
బిల్డింగ్ వర్కర్లకు అసెంబ్లీలో ప్రకటించిన మోటార్ సైకిళ్ళు, పెండింగ్ క్లైములకు నిధులు విడుదల చేయాలి
నవతెలంగాణ-ఇల్లందు
గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా మోటార్ సైకిళ్ళు, పెండింగ్ క్లైములకు నిధులు విడుదల చేయాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ఇల్లందు ఏఎల్వో ఆఫీస్ ముందు ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఏఎల్వో అందుబాటులో లేనందున ఏఎల్వో ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ జానిమియాకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మహిమూద్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ ఇల్లందు ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబీ, సంఘం మండల అధ్యక్షులు తాళ్లూరి కృష్ణ పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్ళు ఇస్తామని పెండింగ్ లో ఉన్న 53 వేల క్లైములకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోర్టు అడ్వైజరీ కమిటీని నియమించాలని వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలనే తదితర డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలో కామ నాగరాజు, కోటేశ్వరరావు, లక్ష్మణ్ పాసి, కే కుమార్, భద్రయ్య, జాడి నరసయ్య, మస్తాన్, సామ్య, జి వెంకటేశ్వర్లు, వెంకన్న, ఎం లక్ష్మీనారాయణ, కే వెంకన్న, గోపాల్ పాసి, ఏ వీరన్న, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.