Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్‌ను క్షేత్ర సందర్శన చేయించిన ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. తొలుత సత్తుపల్లి జ్యోతి నిలయం పక్కన ఉన్న ఐబీ, ఫారెస్ట్ అధికారుల మధ్య ఉన్న భూ వివాదాన్ని అధికారులతో కలిసి క్షేత్ర సందర్శన చేశారు. ఐబీకి సంబంధించిన భూమిలో ఫారెస్ట్ అధికారులు గోడను నిర్మించడం ఇక్కడ వివాదమైంది. ఇరు శాలకకు చెందిన అధికారులు వారివారి దగ్గర ఉన్న మ్యాపులను కలెక్టర్‌కు చూపించారు. అనంతరం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం పక్కన నిర్మాణం జరుగుతున్న వెజ్అండ్ నాన్‌వెజ్ సముదాయాన్ని పరిశీలించారు. నిర్మాణం నత్తనడకన సాగుతున్న విధానంపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను అడిగారు. పనులు వేగవంతంగా జరగాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్‌గా తయారు చేయాలనుకుంటున్న తామరచెరువును పరిశీలించారు. తామరచెరువు వద్ద ఇంతకు ముందు జరిగిన పార్కును పరిశీలించారు. మరింత సుందరంగా, ఆహ్లాకరంగా ఉండటానికి కలెక్టర్ గౌతమ్ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్యశాఖ ఈఈ రంజిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆర్డీవో సూర్యనారాయణ, సింగరేణి జీఎం జక్కం రమేశ్, తహసీల్దారు శ్రీనివాసరావు, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, ఎంపీడీవో సుభాషిణి, నాయకులు దొడ్డా శంకరరావు, ఎస్కే రఫీ, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.