Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
వ్యవసాయ కార్మికులకు, ఆహార భద్రతకు, రైతులకు, బడ్జెట్ తగ్గించడం అన్యాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలోని నిర్మల స్కూల్ వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, సిఐటియు, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వ్యతిరేకంగా బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతుంటే ఉపాధికి బడ్జెట్‌ను 40 శాతం తగ్గించడం అన్యాయం అన్నారు. వెంటనే బడ్జెట్ ని పెంచాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రతకు బడ్జెట్ తగ్గించడాని వ్యవసాయ కార్మికులకు పేదలకు తీవ్ర అన్యాయం అని ఆక్షేపించారు. కేరళ తరహాలో రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చి కొనసాగించాలని డిమాండ్ చేశారు . రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, రైతులకు పెంచాల్సిన బడ్జెట్ తగ్గించడం తీవ్ర అన్యాయం చేయడమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీనివాస్, జిల్లా నాయకులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, టి రాధాకృష్ణ, బంధం శీను, గొర్రె మేకల సంఘం జిల్లా అధ్యక్షులు చింతలచెరువు కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు మాచర్ల గోపాల్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం ప్రభాకర్, పి మురళి, రైతు సంఘం నాయకులు మందా సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : మోదీ ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగ యువతకు అసలు ప్రాధాన్యత లేదని, బీజేపీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన పూర్తి బూటకమే అని, వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగ యువత మోడీని గద్దె దించుతారని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ అన్నారు. గురువారం ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంప్ రోడ్డుపై నిరుద్యోగులకు, యువతకు ప్రాధాన్యత లేని కేంద్ర బడ్జెట్‌ని తిరస్కరించాలని డి.వై.యఫ్.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు సత్తెనపల్లి నరేష్, చింతల రమేష్, పఠాన్ రోషిని ఖాన్, పదముత్తుమ్ ఉష, సుజాత, శీలం వీరబాబు, కూరపాటి శ్రీను, గుమ్మ ముత్తారావ్, రామిశెట్టి సురేష్, దిండు మంగపతి, కనపర్తి గిరి, శభాష్ రెడ్డి, మంగయ్య, సునీల్, సోమయ్య పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : బడ్జెట్లో దళితులకు సక్రమంగా నిధులు కేటాయించలేదని మండల పరిధిలోని నాయుడుపేట వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) ఆధ్వర్యంలో గురువారం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. కార్యక్ర మంలో కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు పాపిట్ల సత్యనారాయణ, జిల్లా నాయకులు నందిగామ కృష్ణ, ఉప్పలయ్య, బాలరాజు, జానయ్య, నాగయ్య, సునీల్, వెంకటేష్, సుశీల, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్డులో గురువారం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నెకంటి సంగయ్య, నాయకులు నండ్ర ప్రసాద్, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, సిద్దినేని కోటయ్య, నందిగామ కృష్ణ, వడ్లమూడి నాగేశ్వరరావు, తోట పెద్ద వెంకటరెడ్డి, వేగినాటి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, బిక్షం, శానం వీరబాబు, గోగుల నాగరాజు, బాబురావు పాల్గొన్నారు.
కల్లూరు : వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం చూపని కేంద్ర బడ్జెట్ ప్రతులు రైతు సంఘం ఆధ్వర్యంలో యజ్ఞ నారాయణపురం గ్రామంలో గురువారం దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు తన్నీరు కృష్ణార్జునరావు, రైతు సంఘం మండల అధ్యక్షులు సామినేని హనుమంతరావు, వ్యకాస మండల కమిటీ సభ్యులు రావి వెంకట సత్యం, రైతులు రావి అజరు, మండేపూడి పెద్దనాసరయ్య, సామినేని సత్యం, మండేపూడి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు
వైరాటౌన్ : కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి భారీ నిధులు కోత విధించండం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని, వ్యవసాయ రంగాన్ని కంపెనీలు పరం చేయుటకు ప్రోత్సాహం ఇచ్చే చర్య బడ్జెట్లో ఉందని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గురువారం వైరా బస్టాండ్ సెంటర్లో బడ్జెట్ పత్రాలు దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం పట్టణ అధ్యక్షులు మల్లెంపాటి రామారావు, కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, సుంకర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు, మచ్చా మణి, బోడపట్ల రవీందర్, కొంగర సుధాకర్, తోట కష్ణవేణి, వాసిరెడ్డి విద్యా సాగర్‌రావు, పల్లెబోయిన కష్ణ, ఇమ్మడి సుధీర్, వడ్లమూడి మధు, యనమద్ది రామకృష్ణ, వేల్పుల రాములు, పాపగంటి రాంబాబు, కిన్నెర మోతి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్ అని ఇది దళిత వ్యతిరేక మనువాద మతోన్మాద బడ్జెట్ అని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గురువారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ ఎదుట మనువాద మతోన్మాద దళిత వ్యతిరేక కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల సాగర్, చర్మకారుల సంఘం, కెవిపిఎస్ నగర నాయకులు సూరారపు బాలరాజు, గుద్దేటి వెంకయ్య, దోసపాటి నాగరాజు, ఉపేందర్, నాని, భద్రం తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : కేంద్రం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ రైతాంగ, కార్మిక, దళిత వ్యతిరేక బడ్జెట్ అని సీపీఐ(ఎం), సీఐటీయూ, రైతు సంఘం నాయకులు విమర్శించారు. గురువారం సత్తుపల్లి పట్టణ రహదారిపై బడ్జెట్ ప్రతులను దగ్థం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, రైతు సంఘం జిల్లా నాయకులు రావుల రాజబాబు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, బడేమియా, వలీ, వెంకటేశ్వరరావు, చంద్రంబాబు, అశోక్, కుమార్, సైదా, మీరా, బాష, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
కేంద్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధిహామీ, ఆహార సబ్సీడీ, రైతుల ఇన్పుట్ సబ్సీడీల కేటాయింపులలో భారీగా కోత విధించి పేదల నోట్లో మట్టికొట్టేలా వ్యవహరించిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ 2023 బడ్జెట్‌ను నిరసిస్తూ గురువారం గంగారంలో సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వ్యకాస సత్తుపల్లి మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, కమలమ్మ, నారాయణ, భద్రమ్మ, రత్తయ్య, కుమారి పాల్గొన్నారు.