Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
అదానీ వ్యవహారంపైన, హిండెన్ బర్గ్ నివేదికపైనా తక్షణమే పార్లమెంట్లో చర్చ జరిపి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ (రాజ్యసభ) నాయకుడు కే.కేశవరావు, లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు,పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ ఆర్ధిక అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాలని వాయిదా తీర్మానం నోటీస్ ఇస్తే సభ ఆర్డర్లో లేదనే కారణంతో సభను వాయిదా వేసి, వెనక్కిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. యావత్ ప్రతిపక్ష సభ్యులంతా ఈ అంశంపై చర్చ జరపాలని పట్టుబడుతున్నా కేంద్రం కావాలనే పార్లమెంట్లో చర్చ జరపకుండా వెనక్కిపోతుందని అన్నారు. ఎప్పుడైనా ఏ సమస్యపైనా అయినా పార్లమెంట్లో చర్చించొచ్చు అన్న కేంద్రం ఎంతో ముఖ్యమైన ఈ సమస్యపై ఎందుకు చర్చ జరపకుండా తప్పించు కుంటుందని ప్రశ్నించారు.