Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ-వైరాటౌన్
మరణించే వరకు సిపిఐ(ఎం) పార్టీ జండాతో, ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అవుతూ నికరమైన కమ్యూనిస్టుగా నిలబడ్డ గొర్రెముచ్చు ఆనందరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. గురువారం వైరా మండలం, వల్లాపురం గ్రామంలో సిపిఐ (ఎం) గ్రామ శాఖ సభ్యులు, సిఐటియు వైరా మండల కమిటీ సభ్యులు అమరజీవి కామ్రేడ్ గొర్రెముచ్చు ఆనందరావు సంస్మరణ సభ గ్రామ కార్యదర్శి బాజోజు రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన అమరజీవి గొర్రెముచ్చు ఆనందరావు స్మారక స్థూపాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భుక్యా వీరభద్రం, బొంతు రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన ఆదర్శ కమ్యూనిస్టు గొర్రెముచ్చు ఆనందరావు ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మండల కార్యదర్శివర్గ సభ్యులు తూము సుధాకర్, రైతు సంఘం నాయకులు వనమా చిన్న సత్యనారాయణ, షేక్ మజీద్ బి, షేక్ పాతిమాబేగం, గొర్రెముచ్చు నవీన్, గొర్రెముచ్చు జైపాల్, గొర్రెముచ్చు నాగరాజు, గొర్రెముచ్చు జయరాజు, మద్ది వెంకటనారాయణ, గొర్రెముచ్చు కనకయ్య, గొర్రెముచ్చు యాకోబు, గొర్రెముచ్చు లాజరు, గొర్రెముచ్చు శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.