Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
వరికి నీరుపెట్టేందుకు సాగర్‌కాల్వలో పైపు వేసేందుకు దిగుతుండగా ముగ్గురు రైతులు కాలు జారి పడిపోయారు. వీరిలో ఇద్దరు రైతులు గల్లంతయ్యారు. నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వ కప్పల బంధం లిఫ్టు సమీపంలో కప్పలబంధం గ్రామానికి చెందిన గుర్రాల లక్ష్మారెడ్డి (54), లక్కిరెడ్డి రాంరెడ్డి (45), షేక్ పుల్లాసాహెబ్లు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎన్ఎస్పీ కాలవలో సైబన్ పైపు వేసేందుకు కాలువలోకి దిగుతుండగా కాలుజారి కాలువలో పడిపోయరు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కాల్వలో గాలించి షేక్ పుల్లా సాహెబ్‌ని రక్షించారు. మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్సై బి కొండలరావు, ఎన్ఎస్పి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రప్పించి కాలవలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకూ ఆచూకీ లభించలేదు.