Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి వినతి
నవతెలంగాణ-కూసుమంచి
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, బడ్జెట్ సమావేశాలలో తమ తరఫున తమ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని గురువారం తెలంగాణ ఆశా కార్యకర్తల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిన్నింటి రమ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, కెవిపిఎస్ జిల్లా నాయకులు కొమ్ము శ్రీనివాసరావు, సిఐటియు తిరుమలాయపాలెం మండల కన్వీనర్ వసపొంగు వీరన్న, జిల్లా సహాయ కార్యదర్శి జ్యోతి, జిల్లా నాయకులు మాచర్ల సుభద్ర, కత్రం ఉమాదేవి, రెంటాల లీలావతి, ఉపేంద్ర, లీలావతి, నాగేంద్ర, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.