Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎంపీఓకి వినతి పత్రం
నవతెలంగాణ-బోనకల్
బోనకల్లు గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని సిపిఎం బోనకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎంపీఓ వ్యాకరణ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రికి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. కుక్కలు గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, చిన్న పిల్లలు రోడ్డు మీద వెళ్లాలంటే భయపడుతున్నారని, ద్విచక్ర వాహనదారులను వెంబడించి కరుస్తున్నాయని, ఏ వీధికి వెళ్ళిన పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తున్నాయని, వీటి బెడద మరింత పెరగకముందే నివారించాలని ఆ వినతి పత్రంలో కోరారు. గతంలో వినతిపత్రం ఇచ్చామని ఇంతవరకు దానిపై చర్య తీసుకోలేదని పేర్కొన్నారు. ఎంపీఓ స్పందిస్తూ ఈనెల చివరికల్లా గ్రామంలో కుక్కల బెడద నివారణకై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతి అందజేసిన వారిలో సిపిఎం గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాస రావు, మాజీ కార్యదర్శి చెన్న లక్షాద్రి, బోనకల్ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు బిల్లా విశ్వనాథం, సిపిఎం నాయకులు గద్దె రామారావు తదితరులు పాల్గొన్నారు.