Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్ అని ఇది దళిత వ్యతిరేక మనువాద మతోన్మాద బడ్జెట్ అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ విమర్శించారు. గురువారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ ఎదుట మనువాద మతోన్మాద దళిత వ్యతిరేక కేంద్ర బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 10 శాతం సైజ్ పెంచినట్లు చూపించిన బడ్జెట్లో సామాజిక న్యాయ సాధికారత దళితుల కోసం కేటాయించిన గత బడ్జెట్ కన్న తక్కువ కేటాయించిన ఘనత నేటి మనువాద మతోన్మాదులకే దక్కుతుందని అన్నారు. గత సంవత్సరం 1819.52 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం కేవలం 976.86 కోట్ల రూపాయలు కేటాయించటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్ల సాగర్, చర్మకారుల సంఘం, కెవిపిఎస్ నగర నాయకులు సూరారపు బాలరాజు, గుద్దేటి వెంకయ్య, దోసపాటి నాగరాజు, ఉపేందర్, నాని, భద్రం తదితరులు పాల్గొన్నారు.