Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో 800 పైగా క్రీడా ప్రాంగణాలు
- పల్లె ప్రగతి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష
నవతెలంగాణ-పాల్వంచ
రానున్న రెండు వారాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాట్లులో రాపిడ్ ప్రోగ్రెస్ రావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎంపిడిఓలను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో డిపిఓ, డిఆర్డీఓ, జడ్పి సీఈఓ, ఎంపీడీఓ, ఎంపిఓలతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వారీగా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు ప్రక్రియను సమీక్షించిన ఆయన జిల్లాలో 800 పైగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు ప్రక్రియ పర్యవేక్షణకు జడ్పి సీఈఓ విద్యాలతను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు చెప్పారు. నిరంతరం పర్యవేక్షణతో లక్ష్యం పూర్తిచేయు విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మోడల్ గా ఉండే విధంగా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు వారం రోజుల్లో నర్సరీలల్లో మొక్కలు పెంచడానికి చర్యలు చేపట్టాలని ఎంపీడీఓలను ఆదేశించారు.
ఓడిఫ్ ప్లస్ గా ప్రకటించిన 378 గ్రామ పంచాయతీ ల్లో లిక్విడ్, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కాగా జరగాలని చెప్పారు. ఎండాకాలంలో మొక్కల సంరక్షణ చాలా ముఖ్యమని ప్రతి శుక్రవారం మొక్కలకు నీళ్లు పోయాలని చెప్పారు. మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇంటి పన్నులు 412 పంచాయతీల్లో నూరు శాతం జరిగిందని లక్ష్యం పూర్తి చేసిన అధికారులను అభినందించారు. 69 గ్రామ పంచాయతీల్లో వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యర్థాల నుండి ఆదాయం సమకూరే విధంగా చర్యలు చేపట్టాలని, ఇప్పటి వరకు వ్యర్థాల ద్వారా 22 లక్షలు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, జడ్పి సీఈఓ విద్యాలత, అన్ని మండలాల ఎంపిడివోలు, ఎంపిఓలు, ఏపీఓ లు తదితరులు పాల్గొన్నారు.