Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
- ఇన్చార్జికి ఇవ్వని బాధ్యతలు
నవతెలంగాణ-వేంసూరు
వేంసూర్ తహసీల్దార్ కుటుంబ సభ్యుల అనారోగ్య కారణంగా సెలవులపై వెళ్లి మూడు రోజులు అవుతున్న నేటి వరకు ఇన్చార్జిని నియమించకపోవడంతో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేయించుకున్న రైతులు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కార్యాలయం ఎదుట పడి గాపులు కాస్తున్నారు. ఏన్కూర్ డిటి రవీందర్ని గురువారం ఇన్చార్జిని నియమించినప్పటికీ అదనపు బాధ్యతలు ఇవ్వకపోవడం గమనార్హం. సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం ఇన్చార్జిని నియమించాలంటూ ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ ల కోసం 26 మంది రైతులు స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే ఇన్చార్జికి బాధ్యతలు ఇవ్వాలని మండల ప్రజలు కోరుతున్నారు.