Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల పైన అదనపు భారాలు మోపవద్దు
- సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్
విద్యుత్ ఏసీడీ చార్జీలు రద్దు చేయాలని సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక డీఈ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం) పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరం నుండి క్యాటగిరి ఒకటి మీటర్లకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గతంలో లేనివిధంగా అదనంగా ఎసిడి చార్జీలను వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలు పైన భారాలు మోపుతుందని, మళ్లీ తెలంగాణలో తిరిగి దీపాలు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఇప్పుడు అదనపు చార్జీల పేరుతో పన్నుల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఎసిడి చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, నాయకులు బొడపట్ల రవీందర్, మచ్చా మణి, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, మల్లేంపాటి ప్రసాదరావు, పాపగంటి రాంబాబు, ఓర్సు సీతారాములు, తోట కష్ణవేణి, యనమద్ది రామకృష్ణ, వడ్లమూడి మధు, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, పల్లేబోయిన కృష్ణ, ఇమ్మడి సుధీర్, కిన్నెర మోతి తదితరులు పాల్గొన్నారు.