Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరాటౌన్
ఫిబ్రవరి 3 నుంచి జరిగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో చర్చించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం సిఐటియు వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వైద్యాధికారికి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు మాట్లాడుతూ ఫిబ్రవరి 3 నుంచి జరిగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో చర్చించి ఆశా వర్కర్లకు పిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని, కంటి వెలుగుకు అదనంగా బిల్లులు చెల్లించాలని, కరోనా రిస్కు పెండింగ్ అలవెన్సులు చెల్లించాలని, ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆశ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు నాగేంద్ర, పద్మ, అమత, గీత, రేణుక, మల్లేశ్వరి, సుజాత, ప్రమీల, నాగమణి, సావిత్రి, వెంకటరమణ, ప్రేమలీల, ద్వారక తదితరులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బోనకల్ : ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు మండల కో కన్వీనర్ గుగులోతు నరేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటే అదనపు పారితోషకం కల్పించాలని డిమాండ్ చేశారు. పాలకులు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. వైద్య శాఖలో క్షేత్రస్థాయిలో నిత్యం ఆశా వర్కర్లు వెట్టి చాకిరి చేస్తున్నారని, కానీ వారి సమస్యలను మాత్రం ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల నాయకురాలు రామణ, సరోజిని, గంగుల విజయలక్ష్మి, మరీదు లీలా కుమారి తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : ఆశా వర్కర్లకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు గురువారం స్థానిక పిహెచ్సి ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటియు మండల కార్యదర్శి షేక్ మస్తాన్ మాట్లాడుతూ ఆశాలు పని ఎక్కువ జీతం తక్కువతో ఇబ్బందులకు గురవుతున్నారని వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి చల్లా నాగేశ్వరరావు, ఆశా వర్కర్ల మండల అధ్యక్షురాలు టి.రాణి, పి నాగవేణి, శాంతమ్మ, ఎం.కృష్ణకుమారి, బి.శ్యామల, నీలిమ నాగలక్ష్మి, కళ్యాణి పాల్గొన్నారు.