Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత రైతు ఇబ్రహీం
నవతెలంగాణ-బోనకల్
అడ్వాంటు 741 అనే మొక్కజొన్న విత్తనాలను సాగు చేసి తాను తీవ్రంగా నష్టపోయానని మండల పరిధిలోనే ముష్టికుంట గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం తెలిపాడు. బాధిత రైతు ఇబ్రహీం తెలిపిన వివరాల ప్రకారం తాను అడ్వాంటు 741 మొక్కజొన్న రకం విత్తనాలను రెండు ఎకరాలలో సాగు చేశాను. రెండు ప్యాకెట్లలో కూడా అడ్వాంటు 741 అనే విత్తనాలు సగం నుంచి ఏరుకురుడు రోగం వచ్చి వైరస్ అని అంటున్నారకని తెలిపాడు. పాత విత్తనాల లోపం అని కంపెనీ వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదని తెలిపారు. విత్తనాలు షాప్ యజమాని కూడా భూమిలో సమస్య ఉందని చెబుతున్నారని తెలిపారు. అనుభవం కలిగిన అన్నదాతలు విత్తనాల లోపం వల్లే ఈ విధంగా జరిగిందని చెబుతున్నారని తెలిపాడు. నేను మోసపోయినట్టుగా ఎవరు ఇలాంటి మోసపూరితమైన విత్తనాలను కొన వద్దని సహచరుల రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. రెండు ఎకరాల మొక్కజొన్న మొత్తం ఏరుకురుడు వచ్చి వైరస్‌గా మారిపోయిందని రైతు తెలిపాడు. ఒక్కొక్క ఎకరానికి 25 వేల వరకు పెట్టుబడి పెట్టానని తెలిపాడు. నష్టపోయిన తనకు కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇటువంటి పురుగుమందుల షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు అండగా నిలవాలని అధికారులను కోరుతున్నాడు.