Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-చండ్రుగొండ
గ్రామీణ వైద్యులకు ప్రభుత్వ శిక్షణ ఇవ్వాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి కొమురయ్య ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన పాలెం గ్రామంలోని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్డి రబ్బాని నివాసంలో ఆయన ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశములో బండి కొమరయ్య మాట్లాడుతూ ఇండ్ల స్థలాలు, డబల్ బెడ్ ఇల్లు గ్రామీణ వైద్యులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ రుణాలు అందించాలన్నారు. సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను ఇకనుంచి పరిగణలోకి తీసుకోమని హెచ్చరించారు. మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల గౌరవ అధ్యక్షులుగా ఎలుక రాజేశ్వరరావు, అధ్యక్షులుగా ఎండి బషీర్, మండల ప్రధాన కార్యదర్శిగా జి.నరసింహారావు, కోశాధికారిగా మండే వీరారావు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా బోడేపూడి విజయలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎస్.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శిలుగా కోటా వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి టి.రామారావు తదితరులను ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్న ఎండి బషీర్ మాట్లాడుతూ... గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మండలంలో బలోపేతానికి, సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పని చేస్తానని అదేవిధంగా జిల్లా కమిటీతో మండలం తరపున అందరం సహకరిస్తామనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు రామ్మూర్తి, జిల్లా సీనియర్ నాయకులు రామదాస్ తదితరులు పాల్గొన్నారు.