Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోగల మొద్దులగూడెం ఎస్టీ కాలనీ గ్రామం నందు గల ప్రభుత్వ గిరిజన ఆదర్శ ప్రాధమిక పాఠశాల నందు విద్యనభ్యసిస్తున్న బుద్ది మాంద్యం (మానసిక వికలాంగురాలు) గల విద్యార్థినీ తోగర్త నాగచైతన్య తండ్రి కృష్ణారావునకు కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టరు అనుదీప్, ప్రభుత్వం వారిచే జిల్లా నందలి ఉన్న మానసిక వికలాంగులలో ఎంపిక చేయబడింది. కొద్దిమందికి సంభంధిత భోధనోపకరణాలు(టీఎల్ఎమ్), వివిధ కృత్యముల జిగ్సేవ్ పజిల్స్ పుస్తకములతో కూడిన సుమారు రూ.10,000 విలువగల మెటీరియల్‌తో పంపిణీ చేయబడిన బ్యాగును శుక్రవారం ప్రభుత్వ గిరిజన ఆదర్శ ప్రాధమిక పాఠశాల మొద్దులగూడెం ఎస్టీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ఎస్ఎంసీ చైర్మన్ పూసి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించి, విద్యార్థినీ తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం బ్యాగునందు ఉన్నటువంటి విలువైన మెటీరియల్ విశిష్టతను, ఉపయోగాలను గురించి, ఆట వస్తువులు, భోధనోపకరణముల వినియోగించు విధానాన్ని విద్యార్థినీ తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వం వారు అందిస్తున్న ఇటువంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోలసిందిగా తల్లిదండ్రులకు తెలియజేశారు. మా గ్రామ పాఠశాల మానసిక వికలాంగ విద్యార్థినీన్ని ఈ పథకానికి ఎంపిక చేసి ఈ విధమైన లబ్ధి సమకూర్చుటలో సహకరించిన దమ్మపేట మండల ఎంఈఓ కే.లక్ష్మీ, మండల ఐఈఆర్పీలు నాగలక్ష్మి, సంతోష్‌కు విద్యార్థినీ తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్పతి, ఎస్ఎంసీ సభ్యులు సోయం శ్రీను, కుంచం నాగమణి పాల్గొన్నారు.