Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేద డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అందించిన రుణాలను మాఫీ చేయాలని ఐద్వా మండల కన్వీనర్ పొడుపు గంటి సమ్మక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బిఎస్ రామయ్య భవన్ ఆవరణలో జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడారు. కరోనా కష్టకాలన్ని ఎదుర్కొని నాన అవస్థలు పడుతున్న నిరుపేద మహిళల డ్వాక్రా రుణాలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సెర్ఫ్ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు. 2018 ఎలక్షన్ సమయంలో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అనుసారంగా మహిళలు తమ తమ రుణాలు మాఫీ చేస్తారని ఆశతో రుణాలు కట్టకుండా ఉండడం అవి వడ్డీలకు వడ్డీలు పెరిగి ఇప్పుడు డ్వాక్రా మహిళలు మోయలేనంత అప్పు భారం తయారయిందన్నారు. కష్టకాలంలో ఉన్న డ్వాక్రా మహిళలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు, శ్రీకాళ, వరదాల వరలక్ష్మి, వడుగుల సరౌని, రేఖ, నాగ కుమారి తదితరులు పాల్గొన్నారు.