Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాహార్తి తీర్చడంలో అధికారుల చర్యలు శూన్యం
- ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం పట్టణంలో గత వారం రోజులుగా కిన్నెరసాని మంచినీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడెం పురపాలక కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సంబంధిత అధికారులకు ఖాళీ బిందెలను అందజేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నీటి ఎద్దడి దారుణంగా ఉందని, ప్రజలు దాహర్తితో అల్లాడుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్స్, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తానే అపరభగీరధుడు, కిన్నెరసాని జలప్రధాత అని బిరుదులు తగిలించుకున్న స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎక్కడ...? ఉన్నారని ప్రశ్నించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళానని, త్వరలో రూ.130 కోట్లు మంజూరు అవుతాయని ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఎద్దెవ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, శారద, సుశీల, బోనవేళ్ళ సతీష్, శీలం అఖిల్, అనీల్ పాల్గొన్నారు.