Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలువ రూ.21లక్షలు
- పోలీసుల అదుపులో ముగ్గురు
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ, ఎక్సైజ్ సూపరిండెంట్
నవతెలంగాణ-ఇల్లందు
350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. డీఎస్పీ రమణమూర్తి, ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....భద్రాచలం నుండి హైదరాబాదుకు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పక్కా సమాచారంతో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో భద్రాచలంలో తనిఖీ చేశారు. ఆపకుండా బారికర్లను ఢకొీని అతివేగంగా కారు వెళ్లిపోయింది. అప్రమత్తమైన ఎక్సైజ్ శాఖ అధికారులు కొత్తగూడెం, ఇల్లందు, టేకులపల్లి ఎక్సైజ్ పోలీస్ శాఖను అప్రమత్తం చేశారు. ఇల్లందు మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకొని పక్కా సమాచారంతో కారును నిలిపేందుకు పోలీస్ ఎక్సైజ్ శాఖకు చెందిన సిబ్బంది ప్రయత్నించగా ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్ బాబాను కారు ఢ కొట్టి ఆపకుండా పట్టణంలోకి వెళ్లారు. ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బాబాకు గాయాలయ్యాయి. అనంతరం ప్రధాన రహదారి మలుపు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. ఘటన స్థలానికి ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు.