Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటి వెలుగు, వైద్యారోగ్య పథకాలు పరిశీలన
నవతెలంగాణ-అశ్వారావుపేట
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ జె.వి.ఎల్ శిరీష జిల్లాలో పలు ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. మండలంలోని అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుమ్మడవల్లిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేశారు. జిల్లాలోనే మారుమూల గ్రామమైన గుమ్మడి వల్లి ప్రాధమిక కేంద్రంలో కాన్పులు చేయించుకున్న బాలింతలకు కేసీఆర్ కిట్ అందచేశారు. ఆరోగ్య కేంద్రంలో గల పలు రికార్డులను పరిశీలించారు. బచ్చు వారి గూడెంలోని కంటి వెలుగు శిభిరాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తు మృతి చెందిన ఆరో పొట్ట మధు పార్ధీవ దేహాన్ని సందర్శించారు. తదుపరి ములకలపల్లి మండలం మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు సకాలంలో సేవలు అందించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. వారి వెంట డాక్టర్ రాందాస్, డాక్టర్ మధుళిక, సిబ్బంది ఉన్నారు.