Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ పునుకొల్లు నీరజ
నవతెలంగాణ- ఖమ్మం కార్పొరేషన్
స్వచ్ఛ సర్వేక్షన్- 2023లో మొదటి ర్యాంకు సాధించే దిశగా ఖమ్మం కార్పొరేషన్ ముందంజలో ఉండాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023లో భాగంగా ఈసారి ఖమ్మం నగరం ఓడిఎఫ్ ప్లస్ దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఓడిఎఫ్ ప్లస్ సాధించే దిశగా ఎస్ ఎఫ్ టి పి ప్లాంటును 59వ డివిజన్ దానవాయిగూడెంలో ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసిందని తెలుపారు. మున్సిపల్ కార్పొరేషన్ అండర్ టేకింగ్ లో 16 ప్రైవేటు సెప్టిక్ ట్యాంకు వాహనాలను ఏర్పాటు చేసి, వారికి లైసెన్సులు ఇచ్చి మిషనరీల ద్వారా సెప్టిక్ ట్యాంకులను ఏ విధంగా క్లీన్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. సెప్టిక్ ట్యాంక్‌లను మిషనరీ ద్వారా లిఫ్ట్ చేసి దానవాయిగూడెం ప్లాంటలో ఎరువుగా తయారుచేస్తున్నామని తెలిపారు. దానిని హరితహారం మొక్కలకు ఎరువుగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఇంట్లో సెప్టిక్ ట్యాంకులను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలని సూచించారు. ఇందుకు మున్సిపల్ కార్పొరేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 14420కు ఫోన్ చేసి సెప్టిక్ ట్యాంకు, డ్రైనేజీలను క్లీన్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవాలని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఈసారి గార్బేజి ఫ్రీ సిటీ 3 స్టార్ రేటింగ్‌కు ఖమ్మం కార్పొరేషన్ సన్నద్ధం అవుతుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఎక్కడా చెత్త పాయింట్లు లేకుండా చూడటం. డ్రెయిన్ లలో చెత్త లేకుండా చూసుకోవడం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం. సుందరీకరణ మొదలైన అంశాలపై దృష్టి సాధించాలని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులు సాధించటం కోసం ఉద్యోగ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ చొరవతో మురికి కూపంగా ఉన్న గోళ్లపాడు ఛానల్‌ను ఎంతో సుందరీకరించి, పార్కులను ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణకు స్వచ్ఛ సర్వేక్షన్లో ఫస్ట్ ర్యాంకు రావాలని సూచించారు.