Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు రైతు సంఘం వినతి
నవతెలంగాణ-ముదిగొండ
కోదాడ నుండి కొరివి వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మండలపరిధిలో ముది గొండ, వెంకటాపురం, చిరుమర్రి గ్రామాలకు చెందిన రైతుల పొలాలకు వెళ్లేందుకు వెంకటాపురం ఎన్ఎస్పి బ్రిడ్జి నిర్మాణం నుండి అండర్‌పాస్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్‌కు శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు వివరించారు. స్పందించిన కలెక్టర్ గౌతమ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన్‌కు సమస్యను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష కార్యదర్శి కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్, నాయకులు మర్లపాటి వెంకటేశ్వర రావు, పోనుకుల సుధాకర్, పుచ్చకాయల రమేష్, తోటకూరి పాపారావు, మల్లారపు వీరబాబు, పి వీరశేఖర్ పలువురు రైతులు పాల్గొన్నారు.