Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీలతో నేరాలు లేని సమాజం
- దేశవ్యావ్తంగా తెలంగాణలోనే సీసీ అధికం
- కారేపల్లిలో సర్కిల్ కార్యాలయంను ప్రారంభించిన సీపీ
నవతెలంగాణ-కారేపల్లి
సీసీకెమెరా ఉంటే ఆప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఉన్నట్లే అని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. కారేపల్లిలో శుక్రవారం సింగరేణి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా సీఐ అరిఫ్ అలీఖాన్ అధ్యక్షతన జరిగిన గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ దేశంఉన్న సీసీ కెమెరాలలో తెలంగాణ రాష్ట్రంలోనే 65 శాతం ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో అధికంగా సీసీ కెమేరాలు ఉన్నాయని తెలిపారు. కెమెరాల ఏర్పాటుతో నేరాల అదుపు, నేరస్తుల గుర్తింపు సులభతరం అవుతుందన్నారు. సింగరేణి మండలంలో చైతన్యం పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాల ఏర్పాటు ముందుకు వస్తున్నారన్నారు. నేను సైతం, ప్రెండ్లీ పోలీసింగ్ లో ప్రజలను భాగస్వామ్యం చేసి సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ దొంగతనం చేసినా దొరికిపోవటం ఖాయమనే స్ధితి రాబోతుందన్నారు. ప్రజాసేవ చేయటానికి మంచి వాతానరణం ఉన్న కార్యాస్ధలం అవసరమన్నారు. పోలీస్ స్టేషన్ పైన ఉన్న సర్కిల్ కార్యాలయాన్ని పక్కనే పోలీస్ క్వార్టర్లో అన్ని హంగులతో అనతి కాలంలో దాతల సహకారంతో ప్రారంభించటంపై సీఐ అరిఫ్ అలీఖాన్‌ను అభినందించారు.
వికలాంగునికి ట్రైసైకిల్ అందజేత
చేతన్ పౌండేషన్ స్వచ్ఛంధ సంస్ధ అంధజేసిన ట్రైసైకిల్‌ను సీపీ విష్ణు ఎస్ వారియర్ దివ్యాంగుడు పోలంపల్లికి చెందిన భూపతికి అందజేశారు. ప్రెండ్లీ పోలీసింగ్, సమాజ సేవకార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్న ఎస్సై పుష్పాల రామారావు, స్వచంధ సంస్ధలను కొనియాడారు. అంతకు ముందు సర్కిల్ కార్యాలయంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ జీ. బస్వారెడ్డి, ఎంపీపీ మాలోత్ శకుంతల, కారేపల్లి, కామేపల్లి ఎస్సైలు పుష్పాల రామారావు, కిరణ్,చీమలపాడు సర్పంచ్ మాలోత్ కిషోర్, టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.