Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 9న చలో హైదరాబాద్
- సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్
నవతెలంగాణ- ఖమ్మం
కార్మికులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, జిల్లా సహాయ కార్యదర్శి వై.విక్రమ్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకి ఇప్పటివరకు చాలామందికి ఇల్లు, ఇళ్ల స్థలాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అర్హులైన కార్మికు లందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఉన్న కార్మికులు ఇల్లు కట్టించేందుకు ఐదు లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు లేని కార్మికులందరితో దరఖాస్తులు పెట్టించి ఈ నెల 9న హైదరాబాదులో ఇందిరాపార్కు దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నాలో ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మికుల పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు టూ టౌన్ కన్వీనర్ కాంపాటి ఎంకన్న, యూనియన్ అధ్యక్షులు వెంకటరమణ, విజయమ్మ ,నాయకులు ఉపేందర్, రాములమ్మ, సత్యవతి, రమణ, అంజలి, తదితరులు పాల్గొన్నారు.