Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యం
- పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటి
నవతెలంగాణ-ఇల్లందు
పార్టీ జెండా ఏదైనా ఏజెండా ఒక్కటేనని... రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి శీనన్న సైన్యంగా పోటిచేసే పదిమంది అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యమని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గం గార్ల , టేకులపల్లి, ఇల్లందు మండలం, ఇల్లందు పట్టణాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ కోరంతో కలిసి పొంగులేటి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన సీపీఐ(ఎం) నేత దేవులపల్లి యాకయ్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పట్టణ కాంగ్రెస్ నాయకులు కోటగిరి ధనరాజ్ తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆర్థిక సహాయం అందజేశారు. గార్ల మండలంలోని నెహ్రు సెంటర్లో పొంగులేటి శీనన్న, కోరం కనకయ్యల క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయగా దానిని పొంగులేటి ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి శీనన్న క్యాంపు కార్యాలయాన్ని ఇల్లందులో ప్రారంభించడం జరిగిందన్నారు. కోరం కనకన్న నేతృత్వంలో ఈ క్యాంపు కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు.