Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ ఏపీవో జనరల్
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు సిలబస్ తొందరగా పూర్తి కావాలని, పూర్తి చేయనివారు వెంటనే పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ పాఠశాలకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చే విధంగా సంబంధిత ప్రిన్సిపాల్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్), ఇన్చార్జి ఆర్సిఓ (గురుకులం) డేవిడ్ రాజ్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ నుంచి పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్లతో ఆయన జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశా లల్లో సబ్జెక్టు పూర్తిస్థాయిలో కవర్ చేయాలని, పాఠశాలలకు సరఫరా అవుతున్న వస్తువుల నాణ్యత పరిశీలించిన తర్వాతనే తీసుకోవా లని ప్రిన్సిపల్లను ఆదేశించారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలకు తప్పనిసరిగా సాఈఓ కళాశాలలో అందరూ ఎంట్రెన్స్ రాసేలా చూడాలని, ఈ నెల 17వ తేదీ నాటికి 100శాతం పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు కళ్యాణ్ బాబు, చంటి పాల్గొన్నారు.