Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన
నవతెలంగాణ-చర్ల
పూర్తిగా వేసవికాలం రాకముందే కరెంటు కష్టాలు ప్రారంభమయ్యాయని సత్యనారాయణ పురం కరెంట్ సబ్ స్టేషన్ను రైతులు శుక్రవారం చుట్టుముట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ...ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ ఉచిత కరంటా.. లేక ఉత్తిత్తి కరంటా అని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. విద్యుత్ సక్రమంగా సమయానుకూలంగా సరఫరా చేయకపోవడంతో పంట పొలాలు నెలల బాస్తున్నాయని గగ్గోలు పెట్టారు. ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ అని డప్పు కొడుతుంటే అది అమలు లేదు సరి కదా రోజువారీగా 12 గంటలు కూడా విద్యుత్ సరఫరా ఇవ్వట్లేదని ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని వారు మండిపడ్డారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారి మాట్లాడుతూ ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే అని త్వరలోనే అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా చూసుకుంటామని రైతులు సహకరించాలి అని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు రాంపండు, సత్తిబాబు, వర్మ రాజు సుబ్బయ్య, పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొన్నారు.