Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
గ్రామ పంచాయితీ సమస్యలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ను మధిర నియోజకవర్గ సర్పంచులు హైదరాబాదులో కలిసి అసెంబ్లీ సమావేశాలలో తమ సమస్యలపై మాట్లాడాలని వినతి పత్రం అందజేశారు. గ్రామపంచాయతీలలో గత ఆరు నెలలుగా నిధులు రాక అప్పులు చేసి మరి ఇబ్బందులు పడుతున్నామని సర్పంచులు ఆయనకు వివరించారు. కనీసం మల్టీపర్పస్ వర్కర్స్ కు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా లక్షలు రూపాయలు పనులు చేసి ఒక్క రూపాయి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని కానీ చేసిన పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రుణదాతలు ప్రతిరోజు తమను డబ్బులు కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారికి సమాధానం చెప్పలేక తీవ్ర మనో ఆవేదన చెందుతున్నామని ఆయనకు వివరించారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్కు డీజిల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నామని వివరించారు. ఇంకా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వివరించారు. బోనకల్, మధిర, చింతకాని మండలాలలో త్రీ ఫేస్ కరెంటు రాక రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటతో పటు అనేక రకాల పంటలు ఎండిపోతున్నాయని ఆయనకు వివరించారు. సాగర్ కాలువ నుండి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని వారబంది అమలు చేయడం వల్ల చివరి భూములకు నీరు అందే పరిస్థితి లేకుండా పోయిందని సర్పంచులు ఆయనకు వివరించారు. గురువారం బోనకల్ మండల రైతులు సాగర్ నీటి కోసం రోడ్డెక్కి గంటలపాటు ఆందోళన చేసిన విషయాన్ని కూడా ఆయనకు వివరించారు. సాగర్ కాలువ ద్వారా మొక్క జొన్న, మీరప రైతులు చివరి భూములకు అందేలా వారబంది లేకుండా మే నెల వరకు సాగర్ నీళ్లు సరఫరా చేసే విధంగా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడాలని సర్పంచులు ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందపురం ఏ, చొప్పకట్లపాలెం, చిరునోముల సర్పంచ్ లు భాగం శ్రీనివాసరావు, ఎర్రం శెట్టి సుబ్బారావు, ములకారపు రవి గార్ల పాడు సర్పంచ్ భర్త దారెల్లి సుందర్ రావు, మధిర మండలం సర్పంచ్ బుల్లెట్ బాబు, చింతాకాని మండలం సీతంపేట సర్పంచ్ నారా పోగు కొండలరావు, పలువురు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.