Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీలకు మనోధైర్యం ఎంతో అవసరమని, వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు, ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన సామర్థ్యాలను, పెంపొందించుకోవడానికి, ఆశ్రమపాఠశాలలో ఉన్నప్పుడే విద్యార్థినులకు మార్గదర్శకత్వం అందించేందుకు వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ప్రతినిధులతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పీఓ గౌతమ్ పోట్రూ అన్నారు. శనివారం భద్రాచలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న వాయిస్ ఫర్ గర్ల్స్ శిక్షణా శిబిరాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినిలతో వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ప్రతినిధులు ఏ విధంగా అవగాహన కల్పించారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే చదు వుతోపాటు ఏదైనా సాధించగలిగే అవకా శం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఏటీడీఓ నరసింహారావు, హెచ్ఎం సావిత్రి, హెచ్ డబ్ల్యు ఓ ద్వారక, శిక్షకులు ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.