Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈవీఎం ఎన్నికల గోదాం వద్ద పటిష్ట పర్యవేక్షణ నిఘా కొనసాగించాలని కలెక్టర్ అండ్ జిల్లా ఎన్నికల అధికారి దురిశెట్టి అనుదీప్ తెలిపారు. శనివారం కొత్తగూడెంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని వివి పాట్, ఈవియం గోడౌన్ను ఆయన తనిఖీ చేశారు. తనిఖీలో గోదాంకు వేసిన తాళం సీలును పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం గోదాం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవియం గోదాంలో రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేసి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఏఓ గన్యా ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.