Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో అందమైన ప్రాంతం ఏది అనగానే గుర్తుకు వచ్చే వరసలో భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం. క్రీడలతోపాటు అనేక రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ క్రీడ మైదానం ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే గతంలో తాళ్లూరి పంచాక్షరయ్యచే నిర్మించ బడిన స్టేజి పైకప్పు రేకులు కాస్త పాడవడంతో వాటిని తొలగించి శాశ్వతంగా స్లాబ్ గావించటం జరిగింది. అంతేకాకుండా స్టేజిని ఆధునికరించటం జరిగింది. ఎన్నో విలువైన కార్యక్రమాలకు ఈ వేదిక ఉపకరించనుంది. దాదాపు రూ.7 లక్షలకు పైగా వ్యయంతో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ వేదిక నిర్మించడం జరిగింది. ఈ వేదికను శనివారం ప్రారంభించారు. చాలా అద్భుతంగా స్టేజి నిర్మాణం గావించబడింది. ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలైనా ఈ వేదికపై ఇక చాలా చక్కగా నిర్వహించుకునే అవకాశం కలిగింది. స్టేజి ప్రారంభోత్సవ వేడుకలో తాళ్లూరి పంచాక్షరయ్య చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిణి బి.సులోచన రాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్టేజి నిర్మాణంకు సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ కృష్ణవేణి, ప్రముఖ ఐటీసీ కాంట్రాక్టర్ పాకాల దుర్గా ప్రసాద్, విద్యావేత్త లక్ష్మీనారాయణ, భద్రాద్రి కళాభారతి అధ్యక్షులు అల్లం నాగేశ్వరావు, నరసింహారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు కుర్షిద్ అహ్మద్, నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి తదితరులు పాల్గొన్నారు.