Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ అధికారి కె.అభిమన్యుడు
నవతెలంగాణ-పాల్వంచ
ఫిబ్రవరి నెలలో చివరివారం వరకు వేసవి పంటలు వేసుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి కే.అభిమన్యుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా రైతులకు వ్యవసాయ సలహాలు సూచనలు తెలిపారు. జిల్లాలో వేసవి పంటగా నీటి సౌకర్యం కలిగిన రైతులు దసరా మినిమం నువ్వులు పంటను విత్తుకోవచ్చని చెప్పారు. సాధారణ రకాలు వేసినప్పుడు ఎకరానికి 8 కిలోలు విత్తనం తీసుకొని వరుసల మధ్య 30 సెంటీమీటర్ల మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా అదేవిధంగా నువ్వులు 30 ఇంటూ 15 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా వితికువచ్చని చెప్పారు. నువ్వు పంటను ఆలస్యంగా వేసినట్లయితే వెర్రి తెగలు సోకే అవకాశం ఉందని సాధన రకాలు ఎకరానికి రెండు కేజీల విత్తనం ఎత్తుకోవాలని చెప్పారు. వరి పంట నారు దశ నుండి పిలకలు తొడిగే దశలో ఉందని, వరి నాట్లు సకాలంలో వేయని రైతులు ముదురు నారు నాటవలసి వచ్చినప్పుడు నారు చివర్లు తురిచి కుదురుకి మొక్కల సంఖ్య 6 నుంచి 8 వరకు పెంచి మొత్తం వరికి సిఫార్సు చేసిన నత్రజనిని అదనంగా 25 శాతం పెంచి మొత్తం నత్రజనిలో దమ్ములో 70 శాతం మిగిలిన 30శాతం అంకురం దశ వరకు వేయాలని చెప్పారు. పిలకలు తొడిగే దశలో పై పాటుగా డీఏపీ 2020 0 13 వంటి కాంప్లెక్స్ రకాల వేసుకోకూడదని చెప్పారు. సాధారణ పొలంలో పై పాటుగా ఎకరాకు 25 నుంచి 30 కేజీల నత్ర జనని సంబంధించిన యూరియాను బురద పదునులో వెదజల్లాలని చెప్పారు. ఆ తరువాత 48 గంటలు గడిచిన అనంతరం పలుచగా నీరు పెట్టాలని తెలిపారు. పిలకలు తొడిగే దశ కలుపు సమస్య వచ్చినట్లయితే నాటిన 15 రోజుల నుండి 21 రోజులు లోపు సై హాలో పాప్ బ్లూ టైల్ పినాక్షులం అనే కలుపు మందును నాలుగు మిల్లీలీటర్ నీటి చొప్పున లేదా ఒక మిల్లీలీటర్ బిస్ పైరి బార్ సోడియం అనుకూలపు మందును పిచికారి చేయాలన్నారు. పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలని నాకు సాక్ స్టేయర్తో మరిన్ని వివరాలకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించి తెలుసుకోవాలని చెప్పారు.