Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12 నుండి 28వ తారీకు వరకు నిర్వహించనున్న పాదయాత్రను గ్రామ పంచాయతీ కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక సిఐటియూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలైన జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు రూ.15,600 ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఏజే. రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ నేతృత్యంలో ఐదు బృందాలతో యాత్ర సాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో గ్రామ పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, పంచాయతీ కార్మిక సంఘం నాయకులు రంగా నరేష్ తదితరులు పాల్గొన్నారు.