Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలవెలుగు పాఠశాలకు ఆర్థిక వితరణ
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకేఓసీ రక్షణ విభాగం ఉద్యోగులు మానవత్వాన్ని చాటుకున్నారని పీకేఓసీ రక్షణ అధికారి ఎం.లింగబాబు అన్నారు. శనివారం స్థానిక సంతోష్ నగర్లోని బాల వెలుగు పాఠశాలకు ఓసీ 2 సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో బియ్యాన్ని వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలలో రక్షణ విభాగం అత్యంత కీలకమైనదన్నారు. తోటి వారిని ఆదుకోవాలనే ఒక మంచి సంకల్పాన్ని కలిగి ఉండటం కూడా ఇతరులకు స్ఫూర్తిదాయకమని సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా, వరుణ్ పర్యవేక్షకులు ఎండీ పర్వేజ్, డి.కార్తీక్, కార్మికులు కే.ఉపేందర్, బి.బిక్షపతి, ఏ.శేషగిరి, ఆర్.నరసయ్య, కె.అరుణాచారి, కె.లింగమూర్తి, బి.కృష్ణ, జి.శ్రావణ్ కుమార్, ఎం.విమల్ కుమార్, పాఠశాల నిర్వాహకులు బి.జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు దుర్గాబాయి, రాధా, తదితరులు పాల్గొన్నారు.