Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం
- పాల్వంచలో ఎస్ఎఫ్ఐ 3వ మహాసభ
- అధ్యక్ష, కార్యదర్శులుగా జహంగీర్, ప్రవీణ్
నవతెలంగాణ-పాల్వంచ
సమసమాజ స్థాపనకు విద్యార్థులందరూ ఏకమవ్వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) పాల్వంచ పట్టణ 3వ మహాసభ నిర్వహించారు. మహాసభకు ఆయన హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రయివేటు బడా బహుళ జాతి విద్యాసంస్థలతో కుమ్మక్కై విదేశీ విద్యాసంస్థలను దేశానికి, రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రతి ఏటా బడ్జెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయిండంలేదన్నారు. ఈ సారి జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లోనైనా రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు, దేశ జీడీపీలో 10 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలన్నారు. విద్యా ప్రైవేటీకరణను ఆపాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండల కమిటీని ప్రకటించారు. ఎస్ఎఫ్ఐ పాల్వంచ పట్టణ అధ్యక్షుడిగా జహంగీర్ కార్యదర్శిగా ప్రవీణ్, ఉపాధ్యక్షుడిగా రమ్య, శ్రావణి ఎన్నికైనట్లు తెలిపారు. 15 మందితో మండల కార్యవర్గం, ఏడుగురితో కార్యదర్శివర్గం ఏర్పాటైందని అన్నారు. మండలలోని విద్యారంగ సమస్యలపై నూతనంగా ఎన్నికైన కమిటీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నవీన్ కొట్టే, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు.