Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే మహోన్నతమైన విజ్ఞాన కేంద్రాలని పలువురు వక్తలు అభివర్ణించారు. శనివారం స్థానిక గ్రంథాలయంలో పాఠకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా పలువురి దాతల సహాయ సహకారంతో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే పూస్తకాలు, రీడింగ్ టేబుల్స్, రైటింగ్ ప్యాడ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లను సమీకరించే కార్యక్రమ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ... మండలంలోని ప్రజలందరూ పుస్తక పఠనాసక్తిని పెంపొందించుకొని, విజ్ఞానాభివృద్ధి చెందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. చర్ల గ్రంథాలయంకు అవసరమైన పుస్తకాలను చర్ల మేజర్ గ్రామపంచాయతీ తరఫున సుమారు రూ.10వేల విలువైన గ్రూప్ వన్, టు, త్రీ, ఫోర్ పోటీ పరీక్షల మెటీరియల్‌తో పాటు తెలంగాణ చరిత్ర, కరెంట్ అఫైర్స్ పుస్తకాలను సమకూర్చారు. విశ్రాంత ఉపాధ్యాయుడు మరల ప్రసాద్ కరోనా కారణంగా మృతి చెందిన తన చిన్న కుమారుని జ్ఞాపకార్థం రీడింగ్ టేబుల్స్‌ను గ్రంథాలయానికి వితరణ చేపట్టారు.
ట్యూబ్ లైట్లను నిమ్మగడ్డ శ్రీమన్నారాయణ-అమ్మ టిఫిన్స్, ఫ్యాన్లు-ట్యూబ్ లైట్లను టాట జ్యూయలరీ, రైటింగ్ ప్యాడ్లను దోమల శరత్ కుమార్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావ్, ఉప సర్పంచి శిరిపురపు శివ, పాలకవర్గ సభ్యులు దొడ్డి హరినాగ వర్మ, పోలూరి సుజాత, కట్టం కన్నారావు, కవాలా రజిత, చిరునోముల బిందు, సింగా సంతోష్, పుర ప్రముఖులు సీవీ రమణ, లయన్ నీలి ప్రకాష్, చీమలమర్రి మురళి కృష్ణ, దొడ్డ ప్రభుదాస్, దొడ్డి తాతారావు, ఈర్సవడ్ల రాము, బత్తుల వెంకటేశ్వర్లు, శాఖా గ్రంథ పాలకులు చుక్కబొట్ల వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.