Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోటీ పరీక్షలలో మెయిన్స్ పరీక్షలకై ఇస్తున్న ఉచిత శిక్షణను గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని అందరూ ఉద్యోగాలు సంపాదించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రూ సూచించారు. శనివారం ఉదయం ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సి భవనంలో గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు నిర్వహిస్తున్న మెయిన్స్ ఉచిత శిక్షణ శిబిరంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు పలు సూచనలు ఇస్తూ ప్రస్తుతం పోలీస్ శాఖలో బెటాలియన్లలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దానికి తగినట్లు విద్యార్థినీ, విద్యార్థులు అందరూ శిక్షణను బాగా తీసుకొని ఉద్యోగాలు సంపాదించాలని, అందుకు తగ్గట్లు ఫ్యాకల్టీలు సూచిస్తున్న సలహాలు, సూచనలను శ్రద్ధతో విని పరీక్షలు బాగా రాయాలని అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పీడీలు సూచించిన విధంగా వ్యాయామము చేస్తూ ఉండాలని, సమయానుకూలంగా పౌష్టిక ఆహారము అందిస్తున్నందున విద్యార్థినీ, విద్యార్థులు సమయపాలన పాటించి క్లాసులకు హాజరై 60 రోజుల ఈ శిక్షణను ఉపయోగించుకొని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. శిక్షణకు సంబంధించిన ఏమైనా మెటీరియల్స్ అవసరమైతే తప్పకుండా అందిస్తామని, అందుకు దానికి సంబంధించిన ప్రతిపాదనలు తనకు సమర్పించాలని ఏసీ ఎంవో రమణయ్యను ఆదేశించారు. అనంతరం పిఎంఆర్సిలోని అదనంగా ఉన్న గదులను పరిశీలించి విద్యార్థినీ, విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాస్ రూములను పెంచాలని బాలికలు, బాలురకు వేరువేరుగా క్లాసులు నిర్వహించాలని, రూములో ఏమైనా రిపేరు ఉంటే వాటిని మరమ్మతులు చేయిస్తామని పీఎంఆర్సిలోని మొత్తం రూములను శుభ్రం చేయించి అన్ని రూములకు పెయింటింగ్ వేయిస్తామని దానికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే తనకు సమర్పించాలని డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో నర్సింగరావు, అసిస్టెంట్ ఏసీఎంఓ బావ సింగ్, కేర్ టేకర్ సర్వేశ్వర దొర, ఫ్యాకల్టీ సతీష్, పీఈటీ వెంకటేశ్వరరావు, పీఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు.