Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ గుమ్మడి గాంధీ
నవతెలంగాణ పినపాక
ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహిళలు పక్కగా నేర్చుకోవాలని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించి, మాట్లాడారు. మండలంలో మనకు అత్యంత దగ్గరగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషమని అన్నారు. ఉచిత శిక్షణ మహిళలకు ఎంతో లాభదాయకమని, అందుకు ప్రతి ఒక్కరూ పక్కాగా కుట్టు మిషన్ శిక్షణ పొందాలని, శిక్షణ అనంతరం ముద్ర, స్టాండప్ ఇండియాలో భాగంగా రూ.50వేల నుంచి అంతకుపైగా ఎంత పెద్ద యూనిట్ నెలకోల్పాలన్నా కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ అనేది ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ఎంపీటీసీ శేఖర్, వారా నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.