Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ అంజనీకుమార్
నవతెలంగాణ- ఖమ్మం
నేరగాళ్ళపై ఉపయోగించే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం నేరసమీక్ష సమావేశంలో భాగంగా హైదరాబాదు డీజీపీ కార్యాలయం నుంచి డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాల పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఖమ్మం నుండి పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నేరాలు ప్రవృత్తిగా మార్చుకొని నేరాలకు పాల్పడే నిందితులు చట్టం నుంచి తప్పించుకోకుండా పోలీస్ అధికారులు క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలని అన్నారు. నేర నిరూపణలో సాంకేతికను సమర్ధవంతంగా వాడుకుంటూ నేర నిరూపణకు అవసరమైన భౌతిక సాక్ష్యాలను, అధారాలను సేకరించడం, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సమన్వయం చేసుకుంటూ సాక్ష్యాలను సకాలంలో న్యాయస్థానంలో ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపిలు గణేష్, రామోజీ రమేష్, ప్రసన్న కుమార్, రహెమాన్, ఏవో అక్తరూనీసాబేగం పాల్గొన్నారు.