Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
చైర్మెన్ మల్లెంపాటి శ్రీధర్
నవతెలంలణ-ఖమ్మం
స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా సస్య భారత్ అనే అంశంపై విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కలిగించడం కోసం సమీప వ్వవసాయ క్షేత్రానికి పర్యటనగా విద్యార్థులను తీసుకొనివెళ్లారు. అక్కడ ఉన్న రైతులను కలిసి వ్యవసాయం ముఖ్య ఉదేశ్యం వరి నాట్లు, కలుపుతీయడం కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని వాటి అవశ్యకతను విద్యార్థులు తెలుసుకున్నారు. రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తూ అక్కడ ఉన్న రైతులను సన్మానించారు. చదువుతో పాటు మా విద్యార్థులకు వ్యవసాయంలో కూడా అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమం రూపొందించినట్లు విద్యాసంస్థల చైర్మెన్ మల్లెంపాటి శ్రీదర్ తెలిపారు. పాఠశాలల డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో అవగాహనతో శ్రీ చైతన్య విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీజీఎం చేతన్ మాధుర్, ప్రిన్సిపల్స్ టీఎల్ఎన్ శర్మ, నీరజ, వైస్ ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, సురేష్, డీన్స్ కేవీఆర్ నవీన్, రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.