Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల వార్షికోత్సవంలో మేయర్ నీరజ
నవతెలంగాణ-ఖమ్మం
ఉన్నత విలువలు కలిగిన విద్యను అందించడంలో నిర్మల్ హృదయ్ ఉన్నత పాఠశాల గత 45 సంవత్సరాలుగా ముందుందని నగర మేయర్ పునుకొల్లు నీరజా అన్నారు. శనివారం ఖమ్మంలోని నిర్మల్ హృదరు ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజా, 53వ డివిజన్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈవో యాదయ్య మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలు ఇలానే కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయిని పద్మజ మాట్లాడుతూ పాఠశాల సాధించిన ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ సాంబశివారెడ్డికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉపాధ్యాయ బృందం ఆయనను ఘనంగా సన్మానించారు. గత సంవత్సరం పదవ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు, గత సంవత్సరం క్లాస్ టాపర్స్‌కు కూడా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చిన్నారులు చేసినటువంటి డ్యాన్సులు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇండస్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అల్లంపాటి రమేష్‌రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ వంగా సాంబశివరెడ్డి దంపతులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రావణి, పాఠశాల డైరెక్టర్స్ సుధాకర్ రెడ్డి, రవి, భరత్‌రెడ్డి, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.