Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ దాములూరి రాము
నవతెలంగాణ- ఖమ్మం
ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది గ్రామీణ, పట్టణ ప్రాంతమని భేదం లేకుండా పలువురకు క్యాన్సర్ వ్యాధి వేగంగా సోకుతుందని అపోలో హాస్పిటల్ ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ దాములూరి రాము పేర్కొన్నారు. సిపిఎం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బివికే) ఆధ్వర్యంలో బిపి, షుగర్ మెడికల్ క్యాంపు విజయవంతంగా నిర్వహించారు. ప్రతి నెలా మొదటి శనివారం జరుగుతున్న ఉచిత మెడికల్ క్యాంపు శనివారం ఖమ్మం మంచికంటి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చి డాక్టర్ రాము రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగతాగడం, టుబాకో నమలడం, స్థూలకాయం, అధిక బరువు, పండ్లు చాలా తక్కువగా తీసుకోవడం, కూరగాయలు తీసుకోనివారు, శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందని తెలిపారు. శరీరంలో వస్తున్న ఆరోగ్య మార్పులను జాగ్రత్తగా గమనించి ఎప్పటి కప్పుడు హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ వస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, నూతనంగా వస్తున్న టెక్నాలజీ హెల్త్ ద్వారా నయం చేయడానికి మందులు ఉన్నాయని తెలిపారు. నెలా నెలా ఖమ్మం నగరంలో జరుగుతున్న ఇటువంటి మెడికల్ క్యాంపులు ప్రజలకు బాగా ఉపయోగపడుతాయని అన్నారు. అనంతరం కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు పరీక్షలు, షుగర్, బిపి సేవలను ఉచితంగా నిర్వహించారు. బిపి, షుగర్‌కు నెలకు సరిపడా మందులు సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, ప్రముఖ డాక్టర్లు సి.భారవి, రావిళ్ళ రంజిత్, కొల్లి అనుదీప్, జి.రాజేష్, పి.సుబ్బారావు, నాయకులు వై.శ్రీనివాస రావు, ఎం.సుబ్బారావు, బోడపట్ల సుదర్శన్, పి.ఝాన్సీ, శివనారయణ, జె.వెంకన్న బాబు, పి.వాసు కాంపాటి వెంకన్న, రామారావు, పి వాసు, వాసిరెడ్డి వీరభద్రం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.