Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
షూటింగ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన తొలి ఆసియా షూటింగ్ బాల్ చాంపియన్షిప్ పోటీలలో ఖమ్మం నగరం, న్యూవిజన్ కళాశాల విద్యార్థిని జక్కంపుడి ధారణి భారత జట్టులో ప్రాతినిధ్యం వహించి ఛాంపియన్షిప్ను సాధించినట్లు ప్రిన్సిపాల్ యం.డి. అబాద్ అలీ తెలిపారు. ఫిబ్రవరి 1, 2 తేదీలలో ఘాజియాబాద్ (ఉత్తర్ ప్రదేశ్)లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన షూటింగ్ బాల్ చాంపియన్షిప్లో సీనియర్ గార్ల్స్ విభాగం భారత జట్టులో పాల్గొన్న జక్కంపుడి. ధారణి తనదైన ప్రతిభని కనబరిచి ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, యునైటెడ్, అరబిక్ ఎమిరేట్ దేశాలు ఈ పోటీలలో పాల్గొనగా మహిళా విభాగంలో బంగ్లాదేశ్ పై విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచిందని తెలిపారు. సామాన్య స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి టీం వరకు ఎగిసిన జక్కంపుడి ధారణిని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్. సి.హెచ్.జి.కె. ప్రసాద్, ప్రిన్సిపాల్ యండి.అబాద్ అలీ, డి.వెంకటరెడ్డి (ఏ.ఓ), వ్యాయామ, ఉపాధ్యాయులు అభినందించారు.