Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పెనుబల్లి
ఏజెన్సీ ప్రాంతంలో బినామీపేరుతో పోపూరి క్రషర్ నిర్వహణలో గిరిజన చట్టాలు తుంగలో తొక్కి పలు అక్రమాలకు తెరలేపింది. లింగగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దేవతల గుట్టను గిరిజనుడు పేరుతో లైసెన్సును సంపాదించి బినామీ అవతారం ఎత్తిన పోపూరి క్రషర్ యజమాని దేవతల గుట్టను నామరపాలు లేకుండా చేస్తున్నాడు. క్వారీ కి సంబంధించి అన్ని అనుమతి పత్రాలు గిరిజనుడు పేరు మీదనే ఉన్నాయంటూ ఆ గిరిజనుడెవరో నేెటికి బయట పెట్టని మైనింగ్ అధికారులు క్వారీ మాత్రం బినామీ పేరు మీద నడుస్తున్న మాట వాస్తవమేనని నమ్మబలికారు. బినామీ లైసెన్స్ దారుడు మైనింగ్ అధికారులు అంటకాగటం వల్లే క్వారీ నిర్వహణ సాధ్యమవుతుందని తెలుస్తోంది. ఇటీవల సంఘటన స్థలానికి వచ్చిన మైనింగ్ అధికారులు క్వారీ నిర్దేశించిన ప్రదేశంలోనే బ్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయని, క్రషర్ నిర్వహణ జరిగే ప్రదేశం తమ పరిధిలోని కాదని రెవెన్యూ పరిధిలో ఉందని దానికి సంబంధించిన అనుమతులు రెవెన్యూ అధికారులే తేల్చాలని వారు పేర్కొన్నారు. పోపూరి బినామీ దారుడు గతంలో లంకాసాగర్ క్రాస్ రోడ్డులో క్రషర్ నిర్వహణ జరిగింది. గత నాలుగైదు సంవత్సరాలుగా దేవతల గుట్ట క్రింది భాగంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి షెడ్లను, క్రషర్ ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నాలా కన్వర్షన్ చెల్లించకుండా అక్రమంగా క్రషర్‌ను నడుపు తున్నట్లు సమాచారం. సంబంధం శాఖ అధికారులు కల్పించుకొని క్వారీలో జరిగే అక్రమాలపై అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.