Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీసర్వే పేరుతో దరఖాస్తు దారులను ఆందోళనకు గురిచేస్తున్నారు
- క్రమబద్దీకణకు కటాప్ తేదీ 2022 వరకు పొడిగించాలి
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ బీఎస్పీ
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలో జిఓ76 ప్రకారం ఇండ్ల క్రమబద్దీకరణ ప్రక్రియ ఏండ్ల తరబడి సాగుతుందని, రీసర్వే పేరుతో దరఖాస్తు దారులను ఆందోళనకు గురిచేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రమబద్దీకరణకు రీసర్వే ఏ ప్రతిపాదికన చేస్తున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి రిజెక్ట్ అయిన వివరాలు తెలియజేసారా...? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రీసర్వే చేయడం ఎవరి కోసమని..? ప్రశ్నించారు. జీఓ.76 ద్వారా మొత్తం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు...? అందులో ఎన్ని దరఖాస్తులు తిరస్కరించారో అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో తిరస్కరించిన దరఖాస్తులు కూడా రీసర్వే చేయాలని కోరారు. ముడుపులు ఇచ్చిన వారికి మాత్రం పట్టాలు చకచకా అయిపోతున్నాయిన, పేదలకు మాత్రం ధృవీకరణ పత్రాలు సరిగా లేవని అధికారులు తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే వనమా 30వేల మందికి పట్టాలు ఇస్తామని ప్రకటించారు. కానీ 10వేల మందికి కూడా ఇవ్వలేదన్నారు. 17 ఏండ్ల నుండి క్రమబద్దీకరణ ప్రకియ సాగుతుందన్నారు. అడ్డగోలు నిబంధనల కారణంగా 70 ఏండ్లుగా నివాసం ఉన్న వారికి పట్టా రాలేదని, 5 సంవత్సరాల క్రితం కట్టిన ఇంటికి మాత్రం పట్టాలు అధికారులు ఇచ్చినట్లు ఆరోపించారు. పాలకులకు పట్టాలు ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే కటాప్ తేదీని 2022 డిసెంబరు వరకు పొడిగించాలని అన్నారు. ఇప్పటికైన పాలకులు క్షుణ్ణంగా ఆలోచించి పేద,మధ్యతరగతి వారకి పట్టాలు అందేల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెనిగారపు నిరంజన్ కుమార్, పోలే కనకరాజు, అల్లకొండ శరత్, ఆకుతోట పవన్ కళ్యాణ్, తుమ్మ వంశీ తదితరులు పాల్గొన్నారు.