Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి 22 వరకు శ్రీముత్యాలమ్మ జాతర మహోత్సవాలు
- విద్యుత్ దీపాల మధ్య దుమ్ముగూడెం
నవతెలంగాణ- దుమ్ముగూడెం
9రోజుల పాటు మండలంలో జరుగు శ్రీముత్మాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా దుమ్ముగూడెం ప్రత్యేక దీపాల కాంతునడుమ జాతరశోభను సంతరించుకుంది. గ్రామంలో తరతరాలుగా వెలసిన గ్రామదేవత శ్రీముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహోత్సవములు నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. 9రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రతి రోజు విశేష పూజలతోపాటు ఉదయం, సాయంత్రం పూట పట్టు వస్త్రాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించనున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్దప్రసాదాలతో పాటు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా జాతర ఉత్సవాల సందర్భంగా దుమ్ముగూడెం గ్రామం విద్యుత్ దీపాలతో అలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జాతరకు భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలతో పాటు పక్క నున్న ఆంద్రప్రదేశ్, చత్తీస్ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తుల సందర్శణార్దం ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాల్లో బాగంగా ఆలయ ఆవరణలో గల కళావేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏదిఏమైనా దుమ్ముగూడెం గ్రామం మొత్తం జాతరశోభను సంతరించుకుంది.