Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని ఎన్ఎస్పి కాలనీలోని టెండర్ రూట్స్ పాఠశాలలో 'ఓల్గాతో ఓ సాయంకాలం' పారుపల్లి ఝాన్సీరాణి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఓల్గా మాట్లాడుతూ తండ్రి, భర్త, కొడుకులపై ఆధారపడకుండా స్త్రీ తన జీవితాన్ని తాను తీర్చిదిద్దుకోగలగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం పొందినట్లని అన్నారు. తన రచనా వ్యాసంగం అంతా స్త్రీ జాతి అన్ని బంధనాల నుండి విముక్త కావటమనే అంశం చుట్టూ తిరిగిందంటూ స్త్రీలు తలచుకుంటే ప్రపంచ గమనాన్నే మార్చగలరన్నారు. పారుపల్లి.ఝాన్సీ మాట్లాడుతూ దశాబ్దాల పోరాటంతో మాత్రమే ఈ రోజు స్త్రీ తనను తాను గెలిపించుకోగలిగిందని, ఇంకా కొన్ని అంశాల్లో స్వేచ్ఛ సాధించాల్సి ఉందన్నారు. అందుకై ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, ఫణి మాధవి, గాజుల భారతి, సుచరిత, జయశ్రీ, జ్యోతి, జిగీష, ఉష, రాధ, తేజస్వి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి నవజీవన ప్రియ ఆహ్వానం పలుకగా మామిల్లపల్లి లక్ష్మి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో జాషువా సాహిత్య వేదిక అధ్యకులు మువ్వా శ్రీనివాసరావు,కార్యదర్శి పగిడిపల్లి.వెంకటేశ్వర్లు రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు.