Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రోజులుగా మంచినీళ్లు రాక ప్రజల ఇబ్బందులు : సిపిఐ(ఎం)
నవతెలంగాణ-వైరాటౌన్
గత పది రోజులుగా వైరా మున్సిపాలిటీ, వైరా మండలంలో ప్రజలకు త్రాగునీరు సరఫరా లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వైరా రిజర్వాయర్ ను సాగర్ జలాలతో పూర్తిస్థాయిలో బ్యాలెన్స్ చేసి మంచి నీళ్ళు నిరంతరాయంగా సరఫరా చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐ(ఎం) బందం వైరా రిజర్వాయర్ పైన ఉన్న మిషన్ భగీరథను పరిశీలించారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు సుంకర సుధాకర్ మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ పైన 12 మండలాల ప్రజలకు త్రాగునీరు అందించే మిషన్ భగీరథ పథకాన్ని ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైరా రిజర్వాయర్‌ను బ్యాలెన్స్ రిజర్వాయర్‌గా ప్రకటించిందని సాగర్ జలాలతో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని మంచి నీళ్ళు బోర్లు కూడా రిపేర్లు లేక ప్రజలు ఇంటి అవసరాలకు నీరు లభించడం లేదని అన్నారు. వైరా రిజర్వాయరులో నీరు నిల్వ సామర్థ్యం తక్కువ అయితే రబీ సీజనులో వరి పంట సాగు నీరు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని మార్చి, ఏప్రిల్, మే నెలలో త్రాగునీరు, సాగు నీరు సమస్యలు రాకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ మార్గంలో మంచి నీరు సరఫరా పునుఃరుద్దురణ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సభ్యులు గుమ్మా నరిసింహరావు, ఓర్సు సీతరాములు, వడ్లమూడి మధు, రామారావు తదితరులు పాల్గొన్నారు.