Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజన కార్మికులకు పెరిగిన గౌరవ వేతనం
నవతెలంగాణ-ఇల్లందు
గత 20 ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకొని కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనంతో బ్రతుకు బండి ఈడుస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస గౌరవ వేతనం 26000 ఇవ్వాలని సిఐటియు అనేక సంవత్సరాలుగా పోరాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రూ.3000 గౌరవ వేతన జీవో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి జిలకర పద్మ, సుల్తానా హర్షం వ్యక్తం చేశారు. సిఐటియు పోరాటాల ఫలితంగానే గౌరవ వేతనం 3000 పెరిగిందన్నారు. భవిష్యత్తులో కోడి గుడ్డు, సరుకులు, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యూటీ తదితర సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా రేణుక, ధనలక్ష్మి, లక్ష్మి, కనకమ్మ, మాదవి, పద్మ యాదమ్మ, ఐలమ్మ, రేణుక, దేవి పుష్పమ్మ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.