Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ ఉప్పతల నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు క్యాంప్ కార్యాలయంలో పిఏ హరికృష్ణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇస్తున్నట్లుగానే జీఓ నెం. 60 ప్రకారం రూ. 15,600లు, కారోబార్, బిల్ కలెక్టర్లలకు రూ.19,500 అమలు చేయాలని కోరారు. 2023 ఫిబ్రవరి 3 నుండి జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మా సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఎమ్మెల్యేలను కోరారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడులను రద్దు చేయాలన్నారు. మోడీ నిర్ణయించిన కనీస వేతనం రోజుకు రూ.178 లు మాకొద్దు. కనీస వేతనం నెలకు రూ. 26,000 లుగా నిర్ణయం చేసి అమలు చేయాలన్నారు జీఓ నెం.60 ప్రకారం మున్సిపల్ సిబ్బందికి చెల్లిస్తున్నట్లుగానే గ్రామపంచాయితీ కార్మికులకు రూ.16,500 కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ. 19,500 కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22,750వేతనాలు చెల్లించాలన్నారు. యాక్ట్ 2/94ను రద్దు చేసి, పంచాయితీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలన్నారు. వారిని అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించాలన్నారు.
ప్రభుత్వ గ్రాంట్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. జీఓ నెం. 51ని సవరించాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. మల్టీపర్పస్ విధానం ద్వారా నియమించబడిన కార్మికుడు, కార్మికురాలు చనిపోతే వారి కుటుంబంలో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పంచాయితీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలన్నారు. పోస్టాఫీసు ద్వారా ఇన్సూరెన్సును ప్రభుత్వమే అమలు చేయాలన్నారు. పంచాయితీ కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇళ్ళ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5,50,000లు ఆర్ధిక సహాయం చేయాలని తెలిపారు. దళిత బంధు పథకాన్ని పంచాయతీ సిబ్బందికి ప్రాధాన్యత ఇచ్చి అమలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వై.రంగయ్య, ఎం.రమేష్, పి.వీరన్న వి.మణమ్మ, సదానందం, ఏ.సురేష్, డి.శంకర్, పాల్గొన్నారు.